త్వరలో భారత్ నుండి వ్యాక్సిన్

Advertisement

కరోనా దేశ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తుంది. అయితే ఒకవైపు ఈ వైరస్ ను అరికట్టడానికి దేశంలో చాలా ఫార్మా సంస్థలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. ఇప్పటికే పలు ఫార్మా సంస్థలకు చెందిన వ్యాక్సిన్ లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మన దేశం నుండి వ్యాక్సిన్ త్వరలో వస్తుంది అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చెప్పాడు.

ఇక ప్రధాని మాటకు అనుగుణంగా త్వరలో భారత్ నుండి శుభవార్త రానుంది. ఒకవైపు భారత్ చెందిన ఒక వ్యాక్సిన్ రెండు మూడు రోజుల్లో మూడవ దశ పరీక్షలకు చేరుకుంటుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. అలాగే ఇప్పటికే భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిల్లా, సీరం ఇనిస్టిట్యూట్‌లు కరోనా వైరస్‌ నిరోధానికి దేశీ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడం​లో బిజీ గా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here