హైదరాబాద్ ఫార్మా సంస్థ నుండి కరోనా మందు.. త్వరలో మార్కెట్ లోకి..

Advertisement

కరోనాకు మందు కనుగొనడం లో హైదరాబాద్ కీలకంగా పని చేస్తుంది. ముందు నుండి ఫార్మా రంగంలో హైదరాబాద్ కు మంచి పేరు ఉంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ అనే సంస్థ కనుగొన్న కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటె తాజాగా హైదరాబాద్ నుండి మరో ఫార్మా సంస్థ ఓ అడుగు ముందు వేయబోతుంది.

ఇక హైదరాబాద్ కి చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మస్యూటికల్స్ అనే సంస్థ కరోనా ఔషధ విషయంలో కీలకంగా పనిచేస్తుంది. కరోనా చికిత్స లో వాడే ఫావిపిరవిర్ ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి బయోఫోర్ ఇండియా ఫార్మస్యూటికల్స్ అనే సంస్థ డీసీజీఐ అనుమతిని పొందింది.

అయితే స్వల్ప , మధ్య లక్షణాలతో ఉన్న వారికి ఈ ఫావిపిరవీర్ ఔషధాన్ని అందించాలని అనుకుంటున్నారు. అలాగే తమ సొంత పరిజ్ఞానం తో ఈ ఔషధాన్ని తయారు చేసాం అని బయోఫోర్ ఇండియా ఫార్మస్యూటికల్ సంస్థ తెలిపింది.

ఈ ఔషధం విదేశాలకు ఎగుమతి చేయడానికి బయోఫోర్ సంస్థ డ్రాగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిని పొందింది. అలాగే ఈ ఔషధ ఏపిఐ (యాక్టివ్ ఫార్మాసూటిక్కల్ ఇంగ్రిడియంట్) ను ఎగుమతి చేయడానికి టర్కీ దేశం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here