కరోనా టెస్టులు చేయించుకుంటున్న ఎంపీలు

Advertisement

త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశానికి హాజరుకానున్న ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. సమావేశానికి హాజరు కావడానికి 72గంటల ముందు ఎంపీతో పాటు కుటుంబ సభ్యులు, వారి ఇంట్లో ఉండే వర్కర్స్, డ్రైవర్స్ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని, కుటుంబ సభ్యుల్లోగానీ, వ్యక్తిగత సహాయ సిబ్బందిలో గానీ ఏ ఒక్కరికి పాజిటివ్‌ వచ్చినా సదరు ఎంపీ 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని వెల్లడించింది. అందరికీ నెగిటివ్‌ వస్తేనే సమావేశాలకు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు ప్రామాణిక విధివిధానాలను (ఎస్‌వోపీ) జారీ చేసింది.

ఎవరైనా ఎంపీ కరోనా టెస్టులు చేయించుకోకుండా సమావేశాలకు వస్తే అక్కడ కూడా కరోనా టెస్టులకు పూర్తి ఏర్పాట్లు చేశారు. టెస్టులు చేయించుకొని వారికి అక్కడే యాంటీ జెన్ టెస్టులు నిర్వహిస్తారు. నెగటివ్ వస్తేనే సమావేశానికి అనుమతి ఉంటుంది. పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచుతారు. కరోనా సమయంలో జరుగుతున్న సమావేశాలకు అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here