Covid : కోవిడ్ భయాలు.! వణుకుతున్న సినిమాలు.!
NQ Staff - December 27, 2022 / 10:17 AM IST

Covid : సినీ పరిశ్రమ మీద మళ్ళీ కోవిడ్ పడగ విప్పనుందా.? సినిమా షూటింగుల దగ్గర్నుంచి, సినిమాల రిలీజుల వరకు.. ముందు ముందు పరిస్థితులు ఏమవుతాయో ఏమో.!
సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు స్ట్రెయిట్‌గా తెలుగులో విడుదలవుతోంటే, రెండు పెద్ద డబ్బింగ్ సినిమాలూ విడుదలవుతున్నాయి. ఇంకోపక్క, కోవిడ్ విజృంభణపై మీడియాలో భయానకరమైన రీతిలో కథనాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతానికైతే భారతదేశంలో కోవిడ్ ప్రమాద ఘంటికలు ఏమీ లేవు. కానీ, చైనాలో కోట్లాది మందికి కోవిడ్ సోకిందన్న ప్రచారంతో ప్రపంచం వణికిపోతోంది.
ఎకానమీ భయాలు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మళ్ళీ కోవిడ్ పంజా విసిరే అవకాశాల్లేకపోలేదు. ఆ సంగతి పక్కన పెడితే, సినిమాలు తొలుత ఇబ్బంది పడతాయ్. ఎందుకంటే కోవిడ్ భయాలనగానే ముందుగా సినిమా థియేటర్లను బంద్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది మరి.!

Covid Likely To Claw Back Global Economy
ఏసీ థియేటర్లు.. అందునా క్లోజ్ చేసి వుండే ప్రాంతాలు గనుక.. కోవిడ్ వ్యాప్తి కేంద్రాలవుతాయన్న అనుమానాలుంటాయ్. ప్రభుత్వాలు బంద్ చేయకపోయినా, ప్రేక్షకులు అటువైపు వెళ్ళడం మానేస్తారు.
ఇప్పుడిప్పుడే మళ్ళీ థియేటర్లకు జనం వస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ కోవిడ్ కొత్త భయమేంటోనని సినీ పరిశ్రమ జనాలు విలవిల్లాడుతున్నారు.