పార్లమెంట్ సమావేశాల్లో కరోనా కలకలం, ఇద్దరు తెలుగు ఎంపీలకు కరోనా

Advertisement

చిన్నా, పెద్దా, పేదోడు, ధనికుడు అనే బేధం లేకుండా కరోనా సమనత్వంతో అందరిని పండబెడుతుంది. ఇప్పటికే దేశంలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ కరోనా సెగ వర్షాకాల శీతాకాల సమావేశాలను కూడా తాకింది. సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన ఇద్దరు వైకాపా ఎంపీలకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిద్దరూ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. విశాఖ జిల్లా అరకు ఎంపీ మాధవి జ్వరంతో బాధపడుతుండటంతో అధికారులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా వైరస్‌ సోకినట్లు తేలింది.

దీంతో ఆమె రెండు వారాల పాటు దిల్లీలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. మరోవైపు చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కూడా కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే దేశంలో చాలామంది రాజకీయ నాయకులు కరోనాకు బలైన విషయం తెలిసిందే. తమ నాయకులు కరోనా నుండి క్షేమంగా బయటపడాలని వారి నియోజక వర్గ ప్రజలు ప్రార్ధనలు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here