Covid 19 : ఇదెక్క‌డి దారుణం.. ఆ పెద్దాయ‌న 11 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడ‌ట‌..!

Covid 19 : క‌రోనా మ‌హ‌మ్మారి నుండి భ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే నివార‌ణ అని చాలా మంది భావించారు. ఈ క్ర‌మంలో దేశంలో చాలా మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కొంద‌రు కరోనా బారిన ప‌డ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. కోవిడ్-19 వ్యాక్సిన్లపై అపొహాలతో కొంత మంది టీకా తీసుకోడానికి వెనుకాడుతుంటే మ‌రి కొంద‌రు వ‌రుస పెట్టి టీకాలు వేయించుకుంటున్నారు.

Covid 19 vaccination 11 times goes viral
Covid 19 vaccination 11 times goes viral

టీకా వల్ల తమకు కొత్త ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని భయపడినవాళ్లూ ఉన్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 11 సార్లు కరోనా టీకా తీసుకోవడం గమనార్హం. సాధారణంగా మొదటి, డోసు రెండో డోసు కలిపితే గరిష్ఠంగా రెండు సార్లు టీకా తీసుకుంటారు.

అలాంటిది తాను 11 సార్లు టీకా తీసుకున్నట్లు బిహార్‌కు చెందిన 84 ఏళ్ల వృద్ధుడు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశమవుతోంది. అర్హ‌త క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. దేశంలో 80 శాతం మంది వ‌ర‌కు మొద‌టి డోసు తీసుకున్నారు. 60 శాతానికిపైగా ప్ర‌జ‌లు రెండో డోసు తీసుకున్నారు. మిగిలిన వారు కూడా వెంట‌నే వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి.

అయితే, ఓ వ్య‌క్తి మాత్రం ఫిబ్ర‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 11 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడు. 12 వ డోసు తీసుకునేందుకు సంబందిత వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌కు వెళ్ల‌గా వ్యాక్సిన్ సెంట‌ర్ మూసి ఉండ‌టంతో వెనుదిరిగాడు. బీహార్‌లోని మాధేపుర జిల్లాలోని ఉద‌కిష‌న్‌గంజ్ డివిజ‌న్‌లోని ఒరాయ్ గ్రామానికి చెందిన 84 ఏళ్ల బ్ర‌హ్మ‌దేవ్ మండ‌ల్ ఫిబ్ర‌వ‌రి 13 వ తేదీని మొద‌టి డోస్ తీసుకున్నాడ‌ట‌.

ఆ త‌రువాత వ‌ర‌స‌గా 11 డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాడు. 11 డోసులు తీసుకున్నా త‌న ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాలేద‌ని చెప్పాడు. 11 డోసులు ఎప్పుడెప్పుడు తీసుకున్నాడో రాసిపెట్టుకున్నాడు. ఒక‌టి, రెండు డోసులు తీసుకోవ‌డానికే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో బ్ర‌హ్మ‌దేవ్ ఏకంగా 11 డోసులు టీకా తీసుకోవ‌డం సంచ‌ల‌నం క‌లిగింది. దీనిపై బీహార్ ఆరోగ్య‌శాఖ విచార‌ణ‌కు ఆదేశించింది.