Covid 19 : క‌రోనా విజృంభ‌ణ‌.. మెడికల్ కాలేజీలో 143 మంది డాక్టర్లకు పాజిటివ్

Covid 19 : క‌రోనా మ‌హ‌మ్మారి పంజా విసురుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు, వైద్యులు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. దీంతో అంద‌రిలో ఆందోళ‌న నెల‌కొంది. ఇటీవ‌ల‌ బీహార్‌లోని నలంద మెడికల్ కాలేజీలో సోమవారం 72 మంది డాక్టర్లు కరోనా బారిన పడగా… తాజాగా మరో 59 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 143 మంది డాక్టర్లు కరోనాతో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు.

Covid 19 cases in medical collage
Covid 19 cases in medical collage

ఈ నేపథ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా ఆయా డాక్టర్లను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కరోనా కట్టడికి బీహార్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది.

మంగళవారం నాడు బీహార్ వ్యాప్తంగా 893 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా… అందులో 565 కేసులు రాజధాని పాట్నాలోనే నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బీహార్‌ వ్యాప్తంగా పార్కులను ప్రభుత్వం మూసివేసింది. అటు రాజకీయ, మత సంబంధమైన కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు.

తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా.. మళ్లీ తీవ్ర రూపం దాల్చుతుండటంతో జనాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తాజాగా భారత్‌లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తూ మళ్లీ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 13,88,647 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో కొత్తగా 58,097 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

ఇప్పటి వరకు దేశంలో 3.50 కోట్ల మంది వైరస్‌ బారిన పడ్డారు. రెండు రోజులుగా 30వేలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతుండటంతో ఆందోళన నెలకొంది.యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,014,004 ఉండగా, ఇప్పటి వరకు 3,43,21,803 మంది రికవరీ అయ్యారు. కొత్తగా 534 మంది కరోనాతో మరణించగా, ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనాతో 4,82,551 మంది మరణించారు. ఇక దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి