Parasailing : చేదు అనుభ‌వం.. పారాసెయిలింగ్ తాడు తెగి స‌ముద్రంలో ప‌డ్డ దంప‌తులు

Parasailing : స‌ర‌దా ఒక్కోసారి చేదు అనుభవాలు మిగిలిస్తూ ఉంటాయి. పారా సెయిలింగ్‌ చేస్తుండగా తాడు తెగి గ‌తంలో చాలా మంది మ‌ర‌ణించారు. కొద్ది రోజుల క్రితం 15 ఏళ్ల బాలుడు అలీబాగ్‌కు విహారయాత్రకు వెళ్లారు. సమీపంలో మురూడ్‌ తీరంలో పారా సేలింగ్‌ చేసేందుకు సిద్దమయ్యారు.పారాచూట్‌ పైకి వెళ్లిన అనంతరం దాని తాడు తెగిపోవడంతో ఒక్కసారిగా గణేష్‌ పవార్‌తోపాటు ఆయన కుమారుడు వేదాంత్‌ పవార్‌ (15) ఇద్దరు చాలా ఎత్తు నుంచి కిందపడిపోయారు. దీంతో ఘటన స్థలంలోనే వేదాంత్‌ దుర్మరణం చెందాడు.

couple falls into sea as rope snaps while parasailing
couple falls into sea as rope snaps while parasailing

తాజాగా గుజరాత్‌కు చెందిన అజిత్‌ కథడ్‌, సరళా కథడ్‌ దంపతులు హాలిడే ట్రిప్‌ కోసం దయూలోని నంగావ్‌ బీచ్‌కు వెళ్లారు. అక్కడ పారా సెయిలింగ్‌ చేయాలని ఆశపడ్డారు. నిర్వాహకులు పవర్‌ బోటు నుంచి వారిని పారాచూట్‌లో పైకెగిరేశారు. అయితే వారు పైకి వెళ్లిన కొద్దిసేపటికే పవర్‌ బోటుకు, పారాచూట్‌కు అనుసంధానంగా ఉన్న తాడు ఒక్కసారిగా తెగిపోయింది. వారు కొద్దిదూరం వెళ్లి సముద్రంలో పడిపోయారు.

couple falls into sea as rope snaps while parasailing
couple falls into sea as rope snaps while parasailing

బోటులో ఉన్న అజిత్‌ కథడ్‌ సోదరుడు రాకేశ్‌ భయంతో అరవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటిలో దూకి వారిని రక్షించారు. లైఫ్‌ జాకెట్లు వేసుకోవడంతో వారు నీటిలో మునిగిపోలేదు. వారికి ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘నా సోదరుడు గాల్లోకి ఎగురుతుండగా వీడియో తీశాను. తాడు తెగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు’ అని రాకేశ్‌ పేర్కొన్నాడు. అని చెప్తూ వీడియో పోస్టు చేశాడు అతని సోదరుడు.

తాడు బలహీనంగా ఉందని, తెగిపోతుందేమోనని ఈ ఫీట్‌కు ముందే సిబ్బందిని హెచ్చరించాడట. ‘మా ప్రాణం పోయినంత పనైంది. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగింది. మా కుటుంబం ఇంకా షాక్‌ నుంచి కోలుకోలేదు’ అని అజిత్ చెప్తున్నాడు.