Pet Dogs : విడ్డూరం : కుక్కల పెళ్లికి మెహందీ, హల్దీ వేడుకలు
NQ Staff - November 14, 2022 / 10:50 AM IST

Pet Dogs : కొందరికి కుక్కలను చూస్తే చిరాకు వేస్తుంది.. కానీ కొందరు మాత్రం కుక్కలను తమ సొంత పిల్లల మాదిరిగా చూసుకోవడం మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. మన దేశంలోనే కాకుండా ఎన్నో దేశాల్లో కూడా కుక్కలను అత్యంత అపురూపంగా చూసుకునే వారు ఉంటారు.
తాజాగా గురుగ్రామ్ లో జరిగిన కుక్కల పెళ్లి దేశ వ్యాప్తంగా చర్చినీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సవిత దంపతులు ఒక ఆడ కుక్కను పెంచుకుంటున్నారు. వారు తాము పెంచుకుంటున్న ఆడ కుక్క స్వీటీకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు.
చుట్టు పక్కల ఉన్న వారి కుక్కలను సవిత పరిశీలించింది. చివరకు తనకు సమీపం లో ఉన్న ఒక కుక్క ను తన కుక్కకు జోడిగా నిర్ణయించింది. తన కుక్క పెళ్లి ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని సవిత దంపతులు భావించారు.
అందుకోసం ఏకంగా కూతురు కు ఏ విధంగా అయితే కట్న కానుకలు ఇచ్చి పెళ్లి వేడుక నిర్వహిస్తారో అదే విధంగా తమ పెంపుడు కుక్కకు కూడా కట్న కానుకలు ఇచ్చి హల్దీ వేడుక నిర్వహించి మెహందీ ఫంక్షన్ నిర్వహించి మేళ తాళాలతో పెళ్లి చేయడం జరిగింది.
ఈ కుక్కల పెళ్ళికి స్థానికులు పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు. అద్భుతమైన విందు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఈ కుక్కల పెళ్లి చర్చనీ అంశమైంది. సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ కుక్కల పెళ్లి హడావుడి అవుతుంది.