Country Delight Fake Business: కంట్రీ డిలైట్ కు అధికారుల నోటీసులు.. అనుమతులు లేకుండానే అమ్మకాలు..!
NQ Staff - September 3, 2023 / 09:01 AM IST

Country Delight Fake Business : కంట్రీ డిలైట్ భాగోతం బయట పడింది. ఇన్ని రోజులు ప్రాడక్టులు అమ్ముతూ కోట్లు గడించిన ఆ సంస్థ అక్రమ వ్యాపారం చేస్తోందని తేలిపోయింది. నిన్న సంగారెడ్డిలోని ప్లాంట్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కంట్రీ డిలైట్ సంస్థ తెలంగాణలో FASSAI అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండానే నెయ్యి, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు చేపడుతున్నారని అధికారులు తేల్చారు.
దాంతో ఆ ప్లాంట్ లో నిల్వ ఉంచిన రూ.52లక్షల విలువైన 1500 లీటర్ల నెయ్యిని సీజ్ చేశారు. ఈ మేరకు కంట్రీ డిలైట్ కు తెలంగాణ ఆహార నాణ్యత ప్రమాణాల విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫార్మ్ టు హోమ్ అంటూ స్టోర్ చేసిన నెయ్యిని వినియోగదారులకు కంట్రీ డిలైట్ అమ్మకాలు చేస్తోంది.
వాస్తవానికి ఫార్మ్ నుంచి తీసుకురావట్లేదు. నెలల కొద్దీ నిల్వ ఉంచిన నెయ్యిని ఇష్టా రీతిన అమ్మేస్తున్నారు. ప్రజలకు ఫార్మ్ టు హోమ్ అంటూ తప్పుడు ప్రచారం కల్పించి వారిని తప్పుదోవ పట్టించినట్టు అధికారులు గుర్తించారు. మిస్ బ్రాండింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన కంట్రీ డిలైట్ ప్లాంట్ అధికారులు సీజ్ చేశారు.