మండలి చైర్మన్ కు కరోనా పాజిటివ్

Advertisement

కరోనా దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలి చైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడ్డాడు. అయితే తనకు కరోనా లక్షణాలు ఉండడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇక తనకు పాజిటివ్ అని రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చేరారు.

ఇక షరీఫ్ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఎమ్మెల్సీలు, టీడీపీ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఒక వైపు ఇప్పటికే ఏపీ లో రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కరోనా బారిన పడి కోలుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here