కరోనా కొత్త లక్షణాలు ఇవే.. ఒక సారి చెక్ చేసుకోండి

Advertisement

కరోనా సోకిన వారిలో కరోనా ని గుర్తించడానికి మరిన్ని కొత్త లక్షణాలు.. మరి ఒక్క సారి చెక్ చేసుకుందామా అవి ఏంటో..? ప్రస్తుత పరిస్థితులలో కరోనా రావడం ఒక
సమస్య అయితే కరోనా వచ్చిందని గుర్తించడం మరో సమస్య గా మారింది. చాలా మందిలో లక్షణాలు చూపించకపోవడం తో కి కరోనా పరీక్షలు నిర్వహించే వరకు కూడా వారికి కరోనా పాజిటివ్ వచ్చింది అని విషయాన్నీ గరహించలేక పోతున్నారు. మరి కొంత మందిలో అయితే వారు చనిపోయే వరకు కూడా బయట పడడం లేదు.

దాని తో చాలా మందిలో కరోనా వచ్చిందన్న విషయాన్ని ఏ విధంగా గుర్తించాలి అన్న ప్రశ్న ఏర్పడింది.. ఇప్పటికే who మీలో జలుబు, తుమ్ములు, జ్వరం, దగ్గు వంటివి మొదలైనట్లయితే వెంటనే కరోనా పరీక్ష లు నిర్వహించుకోవాలి అని సూచించడం జరిగింది. ఆ లక్షణాల తో పాటు ఇప్పుడు కరోనా వచ్చిన వారి లో మరి కొన్ని లక్షణాలు కూడా బయట పడడం జరుగుతుంది అంట. దాని తో మీలో ఈ లక్షణాలు ఉన్న కానీ మీరు వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని కొంత మంది వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

ఇంతకీ ఏంటా లక్షణాలు అన్న వివరాల్లోకి వెళితే తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి కూడా వైరస్ సోకుతున్నట్లు తెలిసింది. దాని తో ఈ లక్షణాలు కూడా కరోనా లక్షణాలు గా గుర్తిస్తూ కొంత మంది వైద్య నిపుణులు ఈ లక్షణాలు కూడా మొదలైనట్లయితే వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది అంటూ తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న జలుబు , తుమ్ములు జ్వరం ,దగ్గు
వలన ఇన్నాళ్లూ కరోనా ఊపిరితిత్తుల పైనే ప్రభావం చూపుతోందని భావించిన వైద్యులకు ఈ కొత్త లక్షణాలు సవాల్ విసురుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా లక్షణాలుగా 11 లక్షణాలను కనుక్కోవడం జరిగింది. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్

సీడీసీ ప్రకారం కరోనా లక్షణాల మొత్తం జాబితా…

  1. జ్వరం లేదా చలి జ్వరం, 2. దగ్గు , 3. శ్వాస అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం , 4. ఆయాసం , 5. ఒంటి నొప్పులు లేదా కండరాల నొప్పులు, 6. తలనొప్పి, 7. రుచి తెలియకపోవడం లేదా వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం, 8. గొంతునొప్పి, 9. జలుబు, 10. వాంతులు, 11. విరేచనాలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here