మురుగు నీరుతో కరోనా వైరస్ వ్యాప్తి : సీసీఎంబీ

Advertisement

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఇప్పటికే కరోనా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే కరోనా ఉన్న వ్యక్తి దగ్గిన, తుమ్మినా ఆ తుమ్మిర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది అని నిపుణులు తెలిపారు. అలాగే మురుగు నీరు ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది అని అంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఉన్న మురుగు నీటి నమూనాలో కరోనా వైరస్ ఆనవాళ్లు గుర్తించినట్లు సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు.

అయన చేసిన పరిశోధనలో మల ముత్రాల్లో కూడా వైరస్ ఉన్నట్లు తెలిపాడు. అలాగే ఆ మల విసర్జనలు నీళ్లలో చేరడంతో ఆ మురికి నీళ్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయని అన్నాడు. అలాగే శరీరం నుండి కూడా 35 రోజుల తరువాత వైరస్ విడుదల అవుతుందని తెలిపాడు. మురికి నీటిని శుభ్ర పరిచే కేంద్రాల నుండి నమూనాలు సేకరించి పరిశోధన చేయగా దాంట్లో వైరస్ ఉన్నట్లు వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here