కరోనా ఎవరికి ఎక్కువగా సోకుతుందో తెలుసా..!
Admin - August 4, 2020 / 09:25 AM IST

కరోనా మహమ్మారి ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి చిన్న, పెద్ద, పేద, ధనిక, కులం, మతం అని తేడా లేకుండా అందరికి సోకుతుంది. అయితే ఈ కరోనా వైరస్ మిగతా వారితో పోలిస్తే ఊబకాయం ఉన్న వ్యక్తులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మన శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్ లెప్టిన్. ఇక ఈ లెప్టిన్ హార్మోన్ శరీరంలో ఎక్కువగా ఉంది అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే లెఫ్టిన్ హార్మోన్ ఉన్న వారికీ కొవ్వు కూడా అధికంగా ఉంటుంది.
దీనితో అనేక సమస్యలు వస్తుంటాయి. అలాగే ఊపిరితిత్తుల సమస్య కూడా అధికంగా ఉంటుంది. లెప్టిన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయ్యే వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. సాధారణ వ్యక్తుల కంటే అధిక బరువు ఉండే వ్యక్తులకు కరోనా సోకుతున్నట్లు వారి పరిశోధనలో తెలిపారు.కావున వీలు అయినంత వరకు బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలని లేకపోతే కరోనా మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.