షాకింగ్ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నీటిలో కరోనా వైరస్?

Hussain Sagar : తాజాగా కరోనా గురించి మరో షాకింగ్ నిజం బయటపడింది. అదే హుస్సేన్ సాగర్. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా విజృంభణతో అందరం కొట్టుమిట్టాడుతున్నాం. దేశవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సందర్భంలో సీసీఎంబీ సైంటిస్టులు పెద్ద బాంబు పేల్చారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ ఉందంటూ ప్రకటించారు. హుస్సేన్ సాగర్ లో కరోనాకు సంబంధించిన వైరస్ జన్యు పదార్థాలు ఉన్నాయట. హుస్సేన్ సాగర్ తో పాటు నిజాం చెరువు, నాచారం పెద్ద చెరువులోనూ కరోనా జెనెటిక్ మెటిరియల్ ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Coronavirus genetic material found in Hussain Sagar in hyderabad
Coronavirus genetic material found in Hussain Sagar in hyderabad

అయితే.. నీటిలో ఉండే ఈ వైరస్ జన్యు పదార్థాల వల్ల పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదట. ఎందుకంటే.. ఈ వైరస్.. నీటి నుంచి మనిషికి వ్యాపించదట. దీంతో హైదరాబాదీలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే మనుషుల ద్వారా కరోనా సోకి అందరూ తెగ టెన్షన్ పడుతుంటే మధ్యలో నీటిలో కూడా కరోనా ఏందిరా బాబు.. అని అంతా అనుకున్నా.. అక్కటి నీటిలో ఉన్న కరోనా వల్ల ఏం ప్రమాదం లేదట.

కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడైతే ప్రారంభం అయితే అప్పటి నుంచే ఆ నీటిలో జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభం అయిందట. ఈ వైరస్ వల్ల మానవ జాతికి పెద్ద ప్రమాదం లేకున్నప్పటికీ.. వైరస్ ఎలా మ్యుటేషన్ చెందుతోంది.. మళ్లీ థర్డ్ వేవ్ గా మారే అవకాశం ఉందా? అనే అంశాల రీసెర్చ్ కోసం మాత్రం ఈ జన్యు పదార్థం శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతోందట. చూద్దాం మరి.. దీని ద్వారా అయినా కరోనా థర్డ్ వేవ్ ను రాకుండా ఆపగలుగుతామో లేదో?