మృతదేహంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందదు: అమెరికా ఇల్లినాయిస్ వర్సిటీ

Advertisement

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింపజేసింది. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రజలందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. చాలా మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంతమంది కరోనా వల్ల చేయడానికి పని దొరక్క, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా వల్ల చనిపోయిన వారికి దహన సంస్కారాలు కూడా కుటుంబ సభ్యులు నిర్వహించలేకపోతున్నారు. కరోనా వల్ల చనిపోయిన వారిని సొంత ఊర్లోకి స్థానిక ప్రజలు భయంతో రానివ్వడం లేదు.

ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామని బాధపడుతున్న వారికి అమెరికా ఇల్లినాయిస్ వర్సిటీ వైద్యనిపుణులు ఊరట కలిగించారు. ఈ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ విజయ చనిపోయిన వారి వల్ల కరోనా వ్యాప్తి చెందదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని, దీనిపై ఉన్న అపోహలను, అనుమానాలను ప్రజలు తొలగించుకోవాలని, దహన సంస్కారాలను అడ్డుకొని మానవత్వాన్ని మంట కలపవద్దని కోరారు. ఈ విషయంపై మంత్రి ఈటెల రాజేందర్ కూడా స్పందించి…చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహించడం కనీస బాధ్యతని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here