చికెన్ తింటే కరోనా సోకుతుందా..!

Advertisement

కరోనా ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ఆ మధ్య చికెన్ తింటే కరోనా వస్తుందని చాలా వార్తలు వచ్చాయి. దీనితో చికెన్ తింటే కరోనా రాదు అని నిపుణులు వెల్లడించారు. ఇది ఇలా ఉంటె తాజాగా చికెన్ తింటే కరోనా వస్తుందని కొంతమంది సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు క్రియేట్ చేయడంతో తిరిగి ప్రజల్లో భయం పట్టుకుంది. ఇదంతా ఫేక్ న్యూస్ అని పీఐబీ స్పష్టం చేసింది. అయితే కోళ్ల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవు అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది.

అయితే కరోనా వైరస్ బాయిలర్ కోళ్ల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టంగా తెలిపింది. మనిషిలో రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే ప్రోటీన్ ఉండే ఆహరం తీసుకోవాలని తెలిపింది. ముఖ్యంగా మాంసం, గుడ్డు, చేపలు వంటివి ఆహారంగా తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఇప్పటికే నిపుణులు స్పష్టంగా వెల్లడించారు. దీనితో చికెన్ తింటే కరోనా వస్తుందనే అసత్య ప్రచారాలు నమ్మొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here