కరోనా వార్డులో ప్రేమాయణం. మొత్తానికి ఒక్కటైనా ప్రేమ జంట. ఎక్కడ జరిగిందంటే…

Advertisement

కరోనా సోకి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి బంధాలకు దూరం అవుతున్నారు. ఇలా బంధాలను దూరం చేస్తున్న కరోనా ఓ జంటను కలిపింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన అమ్మాయి, ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన అబ్బాయి ఈ ఇద్దరు కూడా కరోనా లక్షణాలతో గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు.

ఇక ఆసుపత్రిలో ఇద్దరివి కూడా పక్క పక్క బెడ్లు. అయితే వైద్యులు పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలిన కూడా వ్యాధి లక్షణాలు ఎక్కువగా లేవు. ఇక వీరి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అబ్బాయి హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అలాగే అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వేచి చేస్తుంది.

ఇక వీళ్లిద్దరి ప్రేమను ఆసుపత్రి నుండే తల్లిదండ్రులకు తెలిపి వాళ్ళ ఆమోదం పొందారు. ఇక పది రోజుల తరువాత ఈ ఇద్దరికీ కూడా టెస్టులు చేసి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఈ నెల 25 వ తేదీన పొన్నూరులోని ఓ దేవాలయంలో ఈ కరోనా ప్రేమికుల పెళ్లి జరిగింది.ఇదంతా కూడా కేవలం పది రోజుల వ్యవధిలో జరిగిపోవడం విశేషం. అందుకే అంటారు ఏమో.. మనం ప్రేమించాల్సింది రోగిని.. వ్యాధిని కాదు అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here