Corona : షాకింగ్.! కోరి కరోనాని తెచ్చుకున్నచైనా లేడీ సింగర్.!
NQ Staff - December 22, 2022 / 07:03 PM IST

Corona : కావాలని కరోనా ఎవరైనా తెచ్చుకుంటారా.? చెప్పండి. అది కూడా చైనాలో. అత్యంత ప్రమాదకరమైన ‘బీఎఫ్ 7’ వేరియంట్ విలయ తాండవం చేస్తున్న వేళ ఓ లేడీ సింగర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
అదే సమయంలో విస్తుపోయేలా చేస్తోంది కూడా. త్వరలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని, ప్రదర్శన ఇచ్చేందుకు ఇప్పుడే కావాలని కోవిడ్ అంటించుకున్నానని సదరు సింగర్ సోషల్ మీడియాలో వెల్లడించడం సంచలనంగా మారింది.
ఇదేం విడ్డూరం..!
జేన్ ఝాంగ్ అను ప్రముఖ చైనా సింగర్, నూతన సంవత్సర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వాల్సి వుంది. ఆ టైమ్‌లో అనారోగ్యం బారిన పడితే, ప్రదర్శన ఇవ్వలేననీ, ఒకవేళ అలా జరిగితే అది తన తోటి టీమ్‌కి కూడా ఇబ్బంది అవుతుందని భావించి, కావాలని కరోనా వైరస్ అంటించుకుందట జేన్ ఝాంగ్.
కరోనా పాజిటివ్ వ్యక్తులతో కలిసి తిరిగి కావాలనే కరోనా తెచ్చుకుందట జేన్. కరోనా సోకిన తర్వాత కొద్దిపాటి జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలు కనిపించాయట. ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే, అవి తగ్గిపోయాయనీ, సో న్యూ ఇయర్ వేడకల నాటికి తాను పూర్తి ఆరోగ్యంతో వుంటాననీ మంచి ప్రదర్శన ఇస్తానని ఆమె తన పోస్ట్ ద్వారా వెల్లడించింది.
ఈ పోస్ట్ పట్ల అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, సారీ చెప్పి ఆ పోస్ట్‌ని తొలగించింది జేన్. కానీ, అప్పటికే ఆ పోస్ట్ వైరల్‌గా మారి, నెట్టింట స్వైర విహారం చేస్తోంది.