వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్

Advertisement

హైదరాబాద్: భారత బయో టెక్ సెంటర్ ను సందర్శించిన మంత్రి కేటీఆర్ కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌పై జినోమ్‌ వ్యాలీలో మంత్రి కేటీఆర్ చర్చ వేదిక నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ కోసం దేశం మొత్తం హైద్రాబాద్ వైపు చూస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని మూడు ల్యాబ్స్ లలో కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న బయో టెక్ ఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ… వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నామని, కొత్త వైరస్ కావడం వల్ల అనేక సవాళ్లు కూడా ఎదురు అవుతున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ డెవలప్ మెంట్ లో అమెరికా, వరల్డ్ హెల్త్ ఆర్గనై జేషన్ తమకు సహకరిస్తున్నాయని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ ను వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సిన్ డెవలప్ చేయడంలో తెలంగాణలో ముందు స్థానంలో ఉందని తెలిపారు. ప్రతి చిన్న అనుమతికి ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందని, కొన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here