ఇండియా లో కరోనా వ్యాక్సిన్ మొదటగా ఎక్కడ ఎవరి మీద ప్రయోగించారో చూడండి

Advertisement

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది . ప్రజలందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎప్పడెప్పుడు దీనికి వ్యాక్సిన్ విడుదల అవుతుందా…? అని ఎదురు చూస్తున్నారు . అంతలోనే ప్రజలకు ఆనందకరమైన వార్త తెలుపుతూ భారత్ కి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ కరోనా కి వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది . ఇప్పటి వరకు ఎన్నో చోట్ల కరోనా కి వ్యాక్సిన్ కనిపెట్టాము అని చెప్తున్నప్పటికీ ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ మాత్రం కేవలం 12 కి పైగా ఇండియాలో ని ఫార్మా కంపెనీ లకు మాత్రమే వ్యాక్సిన్ కి సంబంధించిన ట్రయల్స్ కి అనుమతి ని ఇచ్చింది .

దానిలో భాగంగా మొదటగా క్లినికల్ ట్రయల్స్ లో అన్ని పరీక్షలు జరిపిన తరువాత భారత్ బయోటెక్ కి చెందిన కో వాక్సిన్ మంచి ఫలితాలు అందిస్తుండడం తో దానిని వీలైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది భారత ప్రభుత్వం . ఈ కో వ్యాక్సిన్ ని ఆగస్టు 15 లోపు ప్రజలకు అందుబాటు లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేపట్టింది . ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మన ఇండియా లో మొట్ట మొదటిగా ఒక వ్యక్తి మీద ప్రయోగించడం జరిగింది . ఎవరా అనుకుంటున్నారా …?

ఈ వ్యాక్సిన్ ని తయారు చేసినటువంటి భారత్ బయోటెక్ కంపెనీ కి చెందిన వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి కే శ్రీనివాస్ .. మొదట తన మీద ఈ వ్యాక్సిన్ ని పరీక్షించుకోవడం చేశారు . ఈ వ్యాక్సిన్ తన మీద మొదటగా ప్రయోగించుకున్న తరువాత ఆయన మాట్లాడుతూ .. మొట్ట మొదటిగా ఇండియా లో నేను మరియు నా టీం కలిసి డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్ ని నా మీదే ప్రయోగించుకోవడం జరిగింది . అందుకు గాను నేను ఆనందంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు . అయితే భారత్ బయోటెక్ సంస్థ కనిపెట్టిన మొదటి డోస్ ని ఆ కంపెనీ కి చెందిన వైస్ ప్రెసిడెంట్ ఏ తీసుకోవడానికి గల కారణం ప్రజలకు ఆ వ్యాక్సిన్ పైన నమ్మకం కలిగించడం ఒకటి అయితే ఆ సంస్థ కనిపెట్టిన వ్యాక్సిన్ మొదటగా ప్రయోగింపబడింది ఆ కంపెనీ కి చెందిన వారి మీదే అని ఆ వ్యాక్సిన్ చరిత్రలో ఉండాలనుకోవడం మరొక కారణంగా తెలుస్తుంది . మరి ఈ వ్యాక్సిన్ కరోనా ని కట్టడి చేయడం లో ఎక్కువ శాతం మంచి ఫలితాలను అందించేటట్లు గా పని చేసినట్లయితే మరోక నెలలో కరోనా ని ధైర్యంగా ఎదుర్కోడానికి మనం సిద్ధంగా ఉన్నట్టే అనడం లో ఎటువంటి సందేహం లేదు .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here