మంత్రి మల్లారెడ్డి కి కరోనా పాజిటివ్

Advertisement

తెలంగాణలో రాజకీయ నాయకులను కరోనా భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే చాలా వరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. అలాగే కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే నేడు తెరాస ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. ఈ విషయం ఇలా ఉంటె తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డాడు. మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీనితో మంత్రి మల్లారెడ్డి హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. అలాగే మంత్రి కుటుంబ సభ్యులకు మరియు తనతో సన్నిహితంగా ఉన్న వారికీ కూడా వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here