వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి..భారత్ నుండి కరోనా వెళ్లకపోవడానికి కారణం వీళ్ళే..
Admin - July 20, 2020 / 09:54 AM IST

భారత్ లో కరోనా తగ్గకుండా పెరుగుతూ వెళ్లడానికి గల కారణం ఏంటనేది ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. అయితే తాజాగా భారత్ లో కరోనా కేసులు పెరగడానికి గల కారణం ఏంటో కనుక్కున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
కరోనా పుట్టినిల్లు అయిన చైనా లో ఈ వైరస్ వ్యాప్తిని దాదాపుగా అంతమొందించారు. అక్కడ చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. భారత్ లో మాత్రం చాలా తక్కువ స్థాయిలో కేసులు నమోదు అయ్యే స్థాయి నుండి కరోనా వ్యాప్తి లో ప్రపంచ దేశాల్లోనే మూడవ స్థాయికి చేరుకుంది ఇక్కడ కరోనా అంతలా వ్యాప్తి చెందడానికి గల కారణం ఒకటి అన్లాక్ ప్రక్రియ తరువాత ప్రజలు ఇష్టమొచ్చినట్టుగా జాగ్రత్తలు పాటించకుండా సంచరించడం అయితే .. మరొకటి ఇక్కడ చాలా మంది ప్రజలు తప్పుడు అడ్రస్ లు ఇచ్చి అధికారులని బురిడీ కొట్టించడమే అంట.
తాజాగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరియు బెంగళూరుతో సహా కొన్ని ప్రాంతాల్లో అక్కడి పెరుగుతున్న కేసుల దృష్ట్యా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. వేరే రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చిన వారికి నియమాల ప్రకారం 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ని ప్రిఫర్ చెయ్యగా వారు తప్పుడు అడ్రస్ లు ఇచ్చి వారికి నచ్చినట్టుగా సంచరిస్తున్నారు. దీని వలనే వైరస్ విజృంభిస్తుంది అంటూ అధికారులు తెలియ చేస్తున్నారు.
హైదరాబాద్ లో కూడా ఇలా 2200 మంది కరోనా బాధితులు తప్పుడు సమాచారం మరియు అడ్రస్ లు అందించడం జరిగింది అంట. జిహెచ్ఎంసి అధికారులు వారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించడానికి వారి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు నిజం కాస్త బయటపడింది. ఇక కర్ణాటక లో అయితే ఏకంగా 23 వేళా మంది తప్పుడు సమాచారం అందించారు అంట. ఇక దేశం మొత్తం మీద ఇలా తప్పుడు సమాచారం ఇచ్చి ఎంతమంది బయట తిరుగుతున్నారో తెలియడం లేదు. అందువల్లే భారత్ లో కరోనా కేసులు తారా స్థాయికి చేరుకోవడం జరుగుతుంది అంట.
ఇప్పటి వరకు కర్ణాటకలో 69297 మంది హోమ్ క్వారంటైన్ లో ఉంటామని చిరునామాలు అందచేయగా దానిలో 23184 మంది తప్పుడు వివరాలే ఇవ్వడం జరిగింది అంట. ఇలానే అన్ని చోట్ల జరుగుతుండడం తో భారత్ లో కేసులు పెరుగుతూ వెళ్తున్నాయి. లేదంటే అన్ని దేశాల్లో లాగ కరోనా ఇండియా లో తగ్గుముఖం పట్టేది. కేవలం ఇలాంటి వారి వల్లే భారత్ లో కరోనా పెరుగుతూ వెళ్తుంది అంటూ ఇక్కడి అధికారులు తెలపడం జరిగింది