కోవిడ్ వార్డు నుండి ఖైదీ పరార్

Advertisement

కరోనా సోకినా ఓ ఖైదీ క్వారంటైన్ వార్డు నుండి తప్పించుకొని పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే ఏపీ లోని కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం విజయవాడ సబ్‌జైలులోని 17మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో ఆ ఖైదీలను ఈడుపుగల్లులోని క్వారంటైన్ ‌ వార్డుకు తరలించారు.

అయితే ఆ పదిహేడు మందిలో ఒకరు అయిన కె.వెంకటేశ్వరరావు గురువారం తెల్లవారుజామున కోవిడ్ వార్డు నుండి తప్పించుకొని పోయినట్లు జైలు సిబ్బంది గుర్తించారు. ఇటీవల గుణదలలో జరిగిన ఓ హత్యకేసులో వెంకటేశ్వరరావు నిందితుడు. ప్రస్తుతం కంకిపాడు పోలీసులు అతని కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here