ప్రపంచం లోనే మూడో స్థానానికి చేరుకున్న భారత్..!

Advertisement

ప్రపంచం వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇక భారత్ లోను చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఇది ఇలా ఉంటె తాజాగా భారత్ కరోనా కేసుల్లో మూడో స్థానానికి చేరుకుంది. భారత్ లో రోజుకు 24 వేల కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీనితో కరోనా కేసుల్లో రష్యా దేశాన్ని దాటి మూడో స్థానానికి చేరుకుంది భారత్.

భారత్ లో గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 24,248 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు భారత్ లో 425 మంది కరోనా భారిన పడి చనిపోయారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,97,413 కి చేరాయి. ఇప్పటి వరకు కరోనా భారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా అత్యధికంగానే ఉంది. మొత్తం కోలుకున్న కరోనా కేసుల సంఖ్య 4,24,433. అలాగే ఇప్పటివరకు కరోనా తో ఇంకా ఆక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్యా కూడా గణనీయంగానే ఉంది. ఇప్పటివరకు భారత్ లో ఆక్టివ్ గా ఉన్న కరోనా కేసుల సంఖ్యా 2,53,287. అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా భారిన పడి చనిపోయిన వారి సంఖ్యా 19,693.

భారత్ లో మొట్ట మొదటి కరోనా కేసు జులై ఐదవ తేదీన నమోదయ్యింది. మొట్టమొదటి కేసు కేరళా రాష్టంలో నమోదయ్యింది. ఇక జులై ఐదవ తేదీ నుండి ఇప్పటి వరకు మొత్తం 99,69,662 మందికి కరోనా టెస్టులు పరీక్షించినట్టు ICMR సంస్థ తెలిపింది. ఈ ఆదివారం రోజున అత్యధికంగా కేసులు పరీక్షించినట్టు ICMR సంస్థ తెలిపింది. ఆదివారం ఒక్క రోజున 1,80,596 పరీక్షించినట్టు తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ ఉన్న దేశాలు ఒకటి అమెరికా , రెండు బ్రెజిల్ మరియు మూడో స్థానంలో రష్యా దేశం ఉంది. దేశాల వారీగా ప్రథమ స్తానం లో ఉన్న అమేరికా లోని కేసులు సంఖ్యా 29,89,928. అలాగే రెండవ స్తానం లో ఉన్న బ్రెజిల్ లోని కేసుల సంఖ్య 16,04,585. ఇక మూడో స్థానం లో రష్యా ఉంది. ఇక్కడ ఉన్న కేసుల సంఖ్య 6,81,251. తాజాగా భారత్ రష్యా కేసులను దాటి మూడో స్తానం లోకి వెళ్ళింది. దీనితో భయాందోళనలో ఉన్నారు భారత్ ప్రజలు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here