Pawan Kalyan : పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్కే బెటర్.. పరువు తీసుకున్న జనసేనాని..!

NQ Staff - December 5, 2023 / 12:07 PM IST

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్కే బెటర్.. పరువు తీసుకున్న జనసేనాని..!

Pawan Kalyan :

పవన్ కల్యాణ్‌ పరువు గోదారిలో కలిసిపోయింది. ఏదో పొడుస్తా అని బిల్డప్ ఇవ్వడమే తప్ప ఆయన ఎందుకూ పనికి రాడని ఎప్పటికప్పుడు ప్రజలు తేల్చి పడేస్తున్నారు. ఇక తాజగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే నిజమైంది. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ బీజేపీతో పొత్తులు పెట్టుకుని మరీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేశారు. అది కూడా ఏపీ సెటిలర్లు బాగా ఉన్న చోట కావడం విశేషం. మరి ఇంతగా పోటీ చేస్తే ఆయనకు ఒరిగింది ఏంటని ఆలోచిస్తే ఏమీ లేదు. ఈ ఎనిమిది ప్రచారానికి స్వయంగా పవన్ కల్యాణ్‌ వచ్చాడు. జేపీ నడ్డా కూడా వచ్చి ప్రచారం నిర్వహించాడు.

పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ.. తనకు తెలంగాణ పునర్జన్మనిచ్చిందని.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నేను ఏమీ మాట్లాడొద్దు అనే ఉద్దేశంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాను అంటూ సెంటిమెంట్ డైలాగులు కొట్టాడు. అంతే కాకుండా అవినీతి రహిత పాలనే లక్ష్యం అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చాడు. నాలుగు సినిమా డైలాగులు కొట్టడంతో పాటు పవన్ కల్యాణ్‌ ఊగిపోతూ మాట్లాడాడు. ఇంకేముంది జనాలు ఈలలు వేశారు. కానీ తీరా ఓట్ల సమయానికి వచ్చే సరికి నువ్వు ఎవరో, నేను ఎవరో అన్నట్టు పవర్తించారు. పవన్ కల్యాణ్‌ మాటలను గోదాట్లో కలిపేశారు.

కనీసం నోటాకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎంతలా అంటే పవన్ కల్యాణ్‌ కంటే బర్రెలక్కనే నయం అనేంతగా రిజల్ట్ వచ్చింది. పవన్ రేంజ్ తో పోలిస్తే బర్రెలక్క ఒక సామాన్యురాలు మాత్రమే. ఆమె వద్ద డబ్బులు లేవు, పేరు లేదు, ప్రచారం చేయడానికి పార్టీ కార్యకర్తలు కూడా లేరు. ఆమె కేవలం సోషల్ మీడియాలో మాత్రమే బలంగా ప్రచారం చేసుకుంది. కానీ ఆమెకు ఓట్లు మాత్రం బాగానే వచ్చాయి. ఆమెకు ఏకంగా ఐదువేల ఓట్లకు పైచిలకు వచ్చాయి. పవన్ కల్యాణ్‌ పార్టీ తరఫున పోటీ చేసిన వారంతా డిపాజిట్లు కోల్పోయారు.

ఒక్క కూకల్ పల్లిలో మాత్రమే చెప్పుకోదగ్గ సీట్లు వచ్చాయి. అంతకు మించి ఏమీ రాలేదు. మిగతా చోట్ల కనీసం నాలుగు వేల ఓట్లు కూడా దాటలేదు. అంటే పవన్ కల్యాణ్‌ వచ్చి ప్రచారం చేసినా సరే.. బర్రెలక్క కంటే ఎక్కువ ఓట్లు రాలేదంటే ఆయన ఎందుకు పనికి రాడని జనాలు తేల్చి చెప్పేస్తున్నారన్నమాట.

పవన్ కల్యాణ్‌ కేవలం సినిమాలకు మాత్రమే పనికి వస్తాడు తప్ప.. రాజకీయాలకు పనికి రాడని తేల్చేశారు జనాలు. పవన్ కల్యాన్‌ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో.. ఎందుకు మాట్లాడుతాడో కూడా తెలియదు కాబట్టే.. ఇలాంటి తీర్పు ఇచ్చారు జనసేన పార్టీకి. ఏపీ సెటిర్లు ఉన్న చోట చోట కూడా జనసేన నెట్టుకు రాలేకపోయిందంటే.. రేపు ఏపీలో ఎన్నికల పరిస్థితి కూడా అంతే అంటున్నారు నిపుణులు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us