Health Tips : మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాతో చెక్ పెట్టండి..!

NQ Staff - November 8, 2023 / 04:21 PM IST

Health Tips : మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాతో చెక్ పెట్టండి..!

Health Tips :

ఈ జనరేషన్ లో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్దకం. చెప్పుకోవడానికి చిరాగ్గా అనిపించినా ఇది పదిమందిలో నలుగురు ఎదుర్కుంటున్న సమస్య. కాబట్టి దీని గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కువ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, శ్రమలేని పని, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం లాంటివి మలబద్దకానికి దారి తీస్తుంటాయి. దాంతో పటు మన ఆహారపు అలవాట్లు, లైఫ్‌ స్టైల్ కూడా మలబద్దకానికి ప్రధాన కారణంగా నిలుస్తుంటాయి. అందుకే దాన్ని చాలా త్వరగానే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అయితే మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి అందరూ మందులపై ఆధారపడుతూ ఉంటారు. దాని వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్ చిట్కాలతో నివారించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆముదం తరచుగా మలబద్ధకంతో ముడిపడి ఉంటుంది. దీనిని మన ఆహారంలో భాగం చేసుకోవడం మలబద్ధకం చికిత్సకు సహాయపడుతుంది. అయితే ఈ నేచురల్ రెమిడీని దాని పద్ధతుల్లోనే తయారు చేసుకుని వాడుకోవాల్సి ఉంటుంది. ఆముదం నూనెను నీరు లేదా పాలతో కలపడం చాలా ఉత్తమమైన మార్గం.

ఇలా చేసిన వాటితో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ప్రేగు కదలికల ప్రీక్వెన్సీని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్ కారణంగా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఒక టీస్పూన్ ఆముదం నూనెను ముందుగా తీసుకోవాలి. ఇది మీకు దగ్గర్లోని సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది. ఒక టీస్పూన్ ఆముదానికి గోరు వెచ్చని నీటిలో కలిపాలి. అయితే భోజనం అయిన రెండు గంటల తర్వాత దాన్ని తీసుకుంటే చాలా ఉత్తమమైన మార్గం. రోజూ ఇలా భోజనం అయిన తర్వాత తీసుకుంటే చాలా ఉత్తమమైన ప్రయోజనాలు ఉంటాయి.

అయితే ఈ ఆముదం నూనెను 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు అస్సలు ఉపయోగించొద్దు. ఇక మన ఆహారంలో కూడా కూరగాయాలు, బీన్స్, పండ్లు ఉంటేలా చూసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే త్వరగా జీర్ణం అవుతాయి.

దాంతో సులభంగా మలం పేగుల్లో కదులుతుంది. దాంతో పాటు మన లైఫ్ స్టైల్ ను కూడా మార్చుకోవాలి. శ్రమతో కూడిన పనులు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాలి. శారీరక శ్రమ లేకపోతే అది శరీరానికి చాలా ప్రమాదకరం. యోగావంటివి చేస్తూ ఉండాలి. ఫ్రై చేసిన ఆహారాలు, మద్యం మానేయడం ఉత్తమం.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us