Health Tips : గ్యాస్, మలబద్దకంతో బాధపడుతున్నారా.. ఉదయాన్నే వీటిని తాగండి చాలు..!

NQ Staff - October 10, 2023 / 01:44 PM IST

Health Tips : గ్యాస్, మలబద్దకంతో బాధపడుతున్నారా.. ఉదయాన్నే వీటిని తాగండి చాలు..!

Health Tips :

గ్యాస్, మలబద్దకం అనేది ఇవాళ, రేపు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. వాటి బారిన పడి చాలామంది లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. తీసుకుంటున్న ఫుడ్ సరిగ్గా లేకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం లాంటివి అజీర్ణానికి దారి తీస్తుంటాయి. అంతే కాకుండా సమయానికి తినకపోవడం కూడా గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. అయితే వీటిని కొన్ని పానీయాలతో దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే వాటిని తాగితే కచ్చితంగా ఏ సమస్యలు ఉండవు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వేడి నిమ్మరసం..

వేడి నిమ్మరసం అనేది జీర్ణ ప్రక్రియకు బాగా ఉపయోగపడుతుంది. కడుపులో ఉండే ఉబ్బరం, గ్యాస్, అల్సర్ లాంటి సమస్యలను నుంచి త్వరగా ఉపశమనం కల్పిస్తుంది. వేడి నీటితో నిమ్మరసాన్ని పిండుకుని కాసేపు మిక్స్ చేసుకుని తాగేయాలి. ఇది పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. దాంతో ఈజీగా మల విసజర్జన అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి.

అల్లం టీ

ఈ రోజుల్లో చాలామందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంది. అయితే టీని మామూలుగా తాగకుండా.. అందులో కాస్త అల్లం ముక్క వేసుకుని మరిగించుకుని తాగేయాలి. దాని వల్ల ఇన్ఫ్లమేటరీ, డైజెస్టివ్ లక్షణాలు గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిపోతాయి. దాంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

నీరు, ఆపిల్ సైడర్ వెనిగర్..

నీరు ఆపిల్ సైడర్ వెనిగర్ అనేవి జీర్ణక్రియను ఎంతో మెరుగు పరుస్తాయి. కాబట్టి ఉదయాన్నే నీటిని లేదంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ను కూడా తాగొచ్చు. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో ఒకటి నుంచి రెండు టీస్పూన్ల ముడి ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి కలిపి మిక్స్ చేసుకోవాలి. ఒక నిముషం తర్వాత దాన్ని తాగేయాలి. ఇది కడుపులో గ్యాస్ ఇతర సమస్యలను ఈజీగా తగ్గిస్తుంది.

సోంపు వాటర్

సోంపులో ఆహారాన్ని జీర్ణం చేసే లక్షణాలు ఎన్నో ఉంటాయి. ఉదయాన్నే సోంపు వాటర్ తాగితే గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఎన్నో తగ్గిపోతాయి. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఉదయాన్నే కాసిన్ని సోంపు గింజలను వేడి నీటిలో నానబెట్టుకోవాలి. తెల్లవారు లేవగానే వాటిని వడగట్టుకుని లేదంటే డైరెక్టుగా కూడా తాగేయొచ్చు.

పుదీనా టీ

పుదీనా టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ప్రేగు కండరాలను సడలించడంలో బాగా ఉపయోగపడుతాయి. పుదీనా టీని తాగితే కడుపులో ఉండే ఉబ్బరం, వాయువు నుంచి శరవేగంగా ఉపశమనం లభిస్తుంది.

అలోవెరా జ్యూస్

కలబంద గుజ్జు జీర్ణవ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలోవెరా జ్యూస్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దాంతో పేగు కదలికలు బాగా మెరుగుపడుతాయి. కాకపోతే దాన్ని కాసింత తక్కువ పరిణామంలోనే తాగితే బెటర్ గా ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న పానీయాలను ఉదయాన్నే తీసుకుంటే త్వరగా మల విసర్జన అయి మీకు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us