Congress Party Turns Towards YS Sharmila : రేవంత్ ను వణికిస్తున్న షర్మిల ఫీవర్.. అందుకేనా ఈ తిప్పలు..!
NQ Staff - August 16, 2023 / 01:43 PM IST

Congress Party Turns Towards YS Sharmila :
పట్టు పడితే విమర్శల సునామీ వచ్చినా సరే బెదరదు షర్మిల. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అవహేళనలు, ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆమెది తెలంగాణ కాదని, ఆంధ్రా లీడర్ అని, జగన్ వదిలిన బాణం అని.. బీజేపీ అస్త్రం అని.. ఇలా రకరకాలుగా ఆమెను ట్రోల్స్ చేశారు, విమర్శించారు. కానీ ఆమె మాత్రం అవేమీ పట్టించుకోలేదు. తన తండ్రి బాటలోనే తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతానని మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఇప్పటికే తన పాదయాత్ర పేరుతో ఏకంగా గిన్నీ రికార్డుల్లోకి ఎక్కిందంటే ఆమెకు ఉన్న పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఎవరు ఔనన్నా.. కాదన్నా షర్టిలకు రోజు రోజుకూ ప్రజల్లో ఆదరాభిమానులు పెరుగుతున్నాయి. పైగా ఒకప్పుడు ఆమె తండ్రిని అభిమానించిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆమె వెనకాల నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తండ్రి వైఎస్సార్ నడిపించిన పార్టీలోకి వెళ్తే కచ్చితంగా తనకు భవిష్యత్ ఉంటుందని ఆమె భావిస్తోంది. ఒంటరిగా ఇన్ని రోజులు పోరాటం చేసి తన పట్టును పెంచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తే కచ్చితంగా తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆమె ఆశిస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే మంతనాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక వైఎస్సార్ బ్రాండ్ ఎలాగూ ఆమెకు ఉంది కాబట్టి.. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, హనుమంత రావు లాంటి సీనియర్ నాయకులు ఆమె రాకను స్వాగతిస్తున్నారు. అయితే రేవంత్ కు మాత్రం ఆమె రాక అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే.. తనకున్న క్రేజ్ మొత్తం పోతుందని రేవంత్ కు భయం పట్టుకుంది. ఆటోమేటిక్ గా తనకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లు, ఇతర నేతలు మొత్తం షర్మిల వైపు వెళ్లిపోతారు.
అప్పుడు రేవంత్ ఒంటరి వాడు అయిపోతాడు. క్రమక్రమంగా కాంగ్రెస్ మొత్తం షర్మిల వైపు వెళ్తుంది. కాబట్టి అది తన రాజకీయ భవిష్యత్ కే ప్రమాదం అని భావిస్తున్నాడు రేవంత్. అందుకే షర్మిల కాంగ్రెస్ లోకి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే తన మంది బలాన్ని ఉపయోగించి షర్మిల మీద లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నాడు. తన ప్రతి ప్రసంగంలో షర్మిల మీద నిప్పులు కక్కుతున్నాడు. వాస్తవానికి షర్మిల చేసిన అన్యాయాలు, అక్రమాలు తెలంగాణలో ఏమీ లేవు.
అయినా సరే రేవంత్ మాత్రం షర్మిలను కావాలనే టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆమె పార్టీలోకి వస్తే.. విడివిడిగా ఉన్న సీనియర్ నేతలకు షర్మిల నాయకత్వం వహిస్తుంది. రేవంత్ వల్ల పార్టీలో కనుమరుగైపోతున్న వారికి ఆమె అండగా నిలుస్తుంది. అప్పుడు రేవంత్ మీద పార్టీలో వ్యతిరేకత రాక మానదు. ఇప్పటికే రేవంత్ వల్ల చాలామంది సీనియర్లు మైకుల ముందు మాట్లాడే స్వేచ్ఛను కూడా కోల్పోయారు. కాంగ్రెస్ లోకేవలం రేవంత్ తప్ప ఇంకెవరూ మైకులు ముందు మాట్లాడట్లేదు. ఏం చేసినా నేనే చేయాలి, ఏం మాట్లాడినా నేనే మాట్లాడాలి అన్నట్టు ఉంది రేవంత్ దూకుడు.
ఇలాంటి సమయంలో షర్మిల వస్తే రేవంత్ దూకుడుకు బ్రేక్ పడుతుంది. ఆటోమేటిక్ గా అప్పట్లో వైఎస్సార్ వల్ల లబ్ది పొందిన కాంగ్రెస్ సీనియర్లు, ఇతర నేతలు షర్మిలవైపే ఉంటారు. దాంతో రేవంత్ వర్సెస్ షర్మిల అన్నట్టు పరిస్థితి ఉంటుంది. ఎలాగూ కీలక నేతలంతా షర్మిల దిక్కే ఉంటారు కాబట్టి.. రేవంత్ తన పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే షర్మిలను అడ్డుకునేందకు కుట్రలు చేస్తున్నారు. మరి ఈ కుట్రలను షర్మిల ఎలా తిప్పికొడుతుందో చూడాలి.