సీబీఐ విచారణకు రేవంత్ పట్టు

Advertisement

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ఘటన సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని, దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని రేవంత్ ఆరోపించారు. ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు తక్షణమే ప్రభుత్వ ఉద్యగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ను వెంటనే ఉద్యోగం నుండి బర్త్ రఫ్ చేయాలని అన్నారు. అంతేకాకుండా సెక్షన్302 ప్రకారం హత్యానేరం కేసు నమోదుచేయాలని రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ లో అన్ని శాఖలతో పాటు సీఐడీ విభాగం కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే నడుస్తుందని, కాబట్టి సీఐడీ విచారణపై తమకు నమ్మకం ఏమాత్రం లేదని రేవంత్ ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు తెలంగాణ గవర్నర్ తో సహా కేంద్ర హోంశాఖ మంత్రులకు, ఉన్నతాధికారులకు లేఖలు రాయనున్నట్లు రేవంత్ తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సీబీఐ విచారణకు అప్పగించాల్సిందేనని రేవంత్ రెడ్డి పట్టుబట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here