ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్తుండగా.. శ్రీశైలం మార్గమధ్యలోనే ఉప్పునుంతల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మల్లు రవిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో శ్రీశైలం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజా ప్రతినిధులుగా సంఘటన పై పరిశీలించి బాధితులను పరామర్శించడం తమ బాధ్యత అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అయితే అగ్నిప్రమాదం ఘటన పై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. ఇక తమను అడ్డుకున్న పోలీసులపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యాడు.