కరోనా తో కాంగ్రెస్ ఎంపీ మృతి

Advertisement

కరోనా మహమ్మారి ప్రతిఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది. ఒకవైపు ఈ మహమ్మారి రాజకీయ నాయకులను మాత్రం అస్సలు వదలడం లేదు. ఇప్పటికే చాలామంది ఎమ్యెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె కరోనా సోకి కాంగ్రెస్ ఎంపీ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్‌ ఎంపీ వసంతకుమార్‌ (70) కరోనాతో కన్నుమూశారు.

అయితే చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఇక కరోనా కు తోడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం రోజున తుది శ్వాస విడిచారు. ఎంపీ వసంతకుమార్‌ తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి స్వయాన చిన్నాన్న అవుతాడు. ఒకవైపు ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తేలిపారు. అలాగే పలువురు ప్రముఖులు ఎంపీ మృతి పట్ల ద్రిగ్బంతి వ్యక్తం చేసారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here