BJP : ఎన్నికల ముందు నోట్ల రద్దుతో ఆ పార్టీలకు నష్టం తప్పదా?
NQ Staff - May 22, 2023 / 11:16 AM IST

BJP : ఈ ఏడాది మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ కి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కేంద్రం రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం విపక్ష పార్టీలకు తీరని నష్టంను చేకూర్చబోతుంది అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల కోసం రాజకీయ నాయకులు భారీ ఎత్తున నల్ల డబ్బు దాయడం అనేది చాలా కామన్ విషయం. నల్ల డబ్బును పూర్తిగా రెండు వేల రూపాయల నోట్ల రూపంలో వారు దాచుకుని ఉంటారు. అలాంటిది ఇప్పుడు వారు ఆ డబ్బును మార్చుకుని ఖర్చు చేయడం అనేది ఇబ్బందిగా మారుతుంది.
ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టడం కోసం ఇది ఒక వ్యూహం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నోట్ల రద్దు వల్ల బీజేపీ వారికి నష్టం లేదా అంటే వారు ప్రభుత్వం లో ఉన్న వారు కనుక ఏదైనా వారికి సాధ్యమే అంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.
మొత్తానికి రెండు వేల నోట్ల రద్దు తో సామాన్యుల కంటే ఈ సారి ఎక్కువ శాతం పెద్ద నాయకులు మరియు సెలబ్రిటీలు నల్లధనం ఎక్కువగా ఉన్న వారు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.