భూభాగ ఆక్రమణకు మోడీ అనుమతి ఇచ్చారు: రాహుల్ గాంధీ

Advertisement

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. భారత్ యొక్క భూభాగాన్ని చైనా ఆక్రమించడానికి ప్రధాని మోడీ చైనాకు అనుమతి ఇచ్చారని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. భారత సైనికుల పరాక్రమంపై మోడీకి తప్ప దేశ ప్రజలందరికీ నమ్మకం ఉందని వెల్లడించారు. చైనా దేశంలోకి వచ్చి భూభాగాన్ని అక్రమించందంటే మోడీ పిరికితనమే మరో కారణమని ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన వ్యూహానికి బీజేపీ నాయకులు చిత్తు అయిన విషయం తెలిసిందే. బీజేపీ అంచనాలకు అందకుండా కాంగ్రెస్ వేసిన వ్యూహానికి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. కాంగ్రెస్ నాయకులు ఇలాగే సమయపాలనతో వ్యూహాలను మారిస్తే రానున్న రోజుల్లో. కాంగ్రెస్ కు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here