Karnataka : మహిళలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..!
NQ Staff - May 31, 2023 / 12:52 PM IST

Karnataka : అవును మీరు విన్నది నిజమే.. మహిళలకు అదరిపోయే న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి అన్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం అని ప్రకటించింది. దీంతో మహిళా లోకం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఇది మన తెలంగాణలోనో లేదంటే ఏపీలోనో అనుకుంటే పొరపాటే.
మన పక్క రాష్ట్రం కర్ణాటకలో. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సిద్దరామయ్య ఆ రాష్ట్ర సీఎంగా ఉన్నారు. కాగా ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని, ఇందుకోసం ఎలాంటి షరతులు ఉండవని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయినా వెళ్లొచ్చంటూ తెలిపారు మంత్రి. ఇందుకోసం ఎలాంటి షరతులు వర్తించవంటూ తెలిపారు.