HYD: హైదరాబాద్ ప్రజలు.. ఎంత బుద్ధిమంతులో..

HYD: హైదరాబాద్ ప్రజలు ఎంత బుద్ధిమంతులో అని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అంటున్నారు. కరోనా లాక్ డౌన్ విషయంలో 99 శాతం మంది జనాలు పోలీసులకు సహకరిస్తున్నారని, కేవలం ఒక్క శాతం మందే అనవసరంగా రోడ్ల మీదికి వస్తున్నారని చెప్పారు. పనీ పాటా లేకుండా బయటికి వచ్చేవాళ్లను గుర్తించి కేసులు పెడుతున్నామని తెలిపారు. లాక్ డౌన్ ప్రారంభమై దాదాపు 20 రోజులు కావొస్తోందని, నిత్యం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో వేల సంఖ్యలో ఉల్లంఘన కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఆరు వేల దాక వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నామని వెల్లడించారు. హైదరాబాద్ లో 180 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు పోలీసులు డ్యూటీ చేస్తున్నారని వివరించారు. ఈ మేరకు ఆయన ప్రతిరోజూ నగరంలో ఏదో ఒక ప్రాంతంలో కరోనాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారానికి ఒకటీ రెండు సార్లు పాత బస్తీలో లాక్ డౌన్ అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.

hyd

మా బాధను అర్థం చేసుకోండి..

‘‘కొవిడ్ బారి నుంచి మీ ప్రాణాలను కాపాడటం కోసం మేం రోడ్ల మీద కాపలా కాస్తున్నాం. మా కానిస్టేబుళ్లు, ఆఫీసర్లు తమ కుటుంబాలను ఇంట్లో వదిలేసి బయట డ్యూటీ చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్లు పడే బాధేంటో మీరు అర్థం చేసుకుంటారని మనవి. కరోనాపై చేస్తున్న పోరాటంలో ఇప్పటివరకు 50 మంది పోలీస్ ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కష్టానికి, త్యాగానికి మీరు నిజంగా సపోర్ట్ చేసేవాళ్లే అయితే దయచేసి ఇంట్లో ఉండండి’’ అని అంజనీ కుమార్ రిక్వెస్ట్ చేశారు.

hyd

మాస్క్ ఛాయిస్ మీదే..

కరోనా మహమ్మారి సోకితే, ఆరోగ్య పరిస్థితి సీరియస్ అయితే మూతికి, ముక్కుకి వెంటిలేటరో, ఆక్సీజన్ పైపో పెట్టాల్సి వస్తుంది. ఎవరూ కూడా అంతదాకా తెచ్చుకోవద్దు. అందుకే మీకు ఏ మాస్క్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి అంటూ హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విట్టర్ లో సచిత్రంగా చేస్తున్న ప్రచారం ప్రజలను ఆలోచింపజేస్తోంది. కరోనా అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ లో భాగంగా సిటీ రోడ్ల మీద వేస్తున్న పెయింటింగ్స్ సైతం పబ్లిక్ ని అలర్ట్ చేస్తున్నాయి.

hyd