అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన కమెడియన్ పృథ్వి రాజ్

Advertisement

హైదరాబాద్: గత కొంత కాలంగా రకరకాల వివాదాల్లో చిక్కుకుంటున్న నటుడు పృథ్వి రాజ్ తాజాగా హాస్పిటల్ లో చేరారు. గత కొన్ని రోజుల నుండి జలుబు, జ్వరంతో బాధపడుతున్న పృథ్వి రాజ్ నేడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. రెండు సార్లు కరోనా పరీక్షలు చేసినా కూడా నెగటివ్ వచ్చిందని తెలిపారు. కొన్నిసార్లు లక్షణాలు ఉన్నపటికీ పరీక్షల్లో నెగటివ్ చూపించే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం పృథ్వి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తానని వీడియో తెలిపారు. గతంలో టీటీడీ చైర్మన్ గా విధులు నిర్వహించిన పృథ్వి కొన్ని వివాదాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో పృథ్వి వైసీపీ అధినేత జగన్ తరుపున ప్రచారం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here