Comedian Sudhakar : కమెడియన్ సుధాకర్ కొడుక్కు చిరు భారీ సాయం.. స్నేహితుడి కోసం మెగాస్టార్ నిర్ణయం..!
NQ Staff - June 21, 2023 / 09:16 AM IST

Comedian Sudhakar : కమెడియన్ సుధాకర్ అంటే అప్పటి జనరేషన్ కు అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందల సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. కేవలం కమెడియన్ గానే కాకుండా ఆయన హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ ఆయన స్టార్ హీరో మాత్రం కాలేకపోయారు.
కానీ కమెడియన్ సుధాకర్ గా మాత్రం సక్సెస్ అయ్యారు. అబ్బబ్బా.. టేచల్ టేచల్ లాంటి డైలాగులు ఆయన్ను మరో లెవల్ లో నిలబెట్టాయి. ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కు తిరిగి చూసుకోలేదు. కానీ గత కొంత కాలంగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు.
ఈ క్రమంలోనే మొన్న ఓ ఛానెల్ లో నిర్వహించిన ఈవెంట్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు చిరంజీవి ఎంతో మంచి మిత్రుడు. నా తర్వాత నా కొడుకు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఆ బాధ్యతలు మొత్తం చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నాడు.
త్వరలోనే చిరంజీవి చేతులు మీదుగా నా కొడుకు ఎంట్రీ ఉండబోతోంది. గతంలో నా కొడుకు కాలేజీ సీటు కోసం కూడా చిరంజీవి ఎంతో హెల్ప్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఆయన సాయం చేయబోతున్నాడు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ తెలిపాడు సుధాకర్. అప్పట్లో చిరంజీవి, సుధాకర్ మంచి మిత్రులు. అందుకే స్నేహితుడి చిరు ఈ సాయం చేయబోతున్నాడు.