నా సంపదలో 25% సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తా: షకలక శంకర్

Admin - August 20, 2020 / 06:54 AM IST

నా సంపదలో 25% సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తా: షకలక శంకర్

షకలక శంకర్ గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు ఉండరు. జబర్దస్త్ కామెడీ షోతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తన కామెడీతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. కమెడియన్ గా ఉన్న షకలక శంకర్ ఇప్పుడు హీరోగా కూడా మూవీస్ చేస్తున్నాడు. అయితే కరోనా కష్టకాలంలో తన సేవా గుణాని చాటుకున్నాడు.

దర్శకత్వశాఖలో పని చేసే బైరు సిద్ధు అనే కుర్రాడి కుటుంబం దీనావస్థ తెలుసుకుని చలించిపోయిన షకలక శంకర్ లక్షా పది వేల రూపాయలతో ఆ కుటుంబానికి కాడెద్దులు, నాగలి కొనిపెట్టారు. నల్గొండ జిల్లా, గుర్రంపోడ్ మండలం… ‘పాల్వాయి’ అనే పల్లెటూరుకు చెందిన బైరు చిన నర్సింహ-లక్ష్మమ్మ దంపతులకు ఈ సహాయం చేశారు. జేబులో పది రూపాయలు కూడా లేక అల్లాడిన పరిస్థితి నుంచి లక్షా పది వేలతో ఓ కుటుంబంలో వెలుగులు పంచే పొజిషన్ ఇచ్చిన కళామతల్లికి ఎప్పటికీ రుణపడి ఉంటానని శంకర్ తెలిపారు. ఇకపై తన సంపదలో 25% సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తానని వెల్లడించారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us