యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న కలర్ ఫోటో మూవీ టీజర్
Admin - August 6, 2020 / 01:00 PM IST

హైదరాబాద్: షార్ట్ ఫిలిమ్స్ తో, స్కెచ్ వీడియోస్ తో యూట్యూబ్ లో కెరీర్ ప్రారంభించిన హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరి యొక్క కొత్త మూవీ కలర్ ఫోటో టీజర్ 1 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీ యొక్క టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేస్తూ, మూవీ టీంకు అభినందనలు తెలిపారు. ఈ మూవీని హృదయ కాలేయం మూవీని డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ మూవీని సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీలో హీరోగా నటిస్తున్న సుహాస్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మజిలీ, ఉమ మహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి, తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న చాందినీ కూడా మను అనే ఒక మూవీలో నటించి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.