College Management : అమ్మాయిలకు బాయ్‌ ఫ్రెండ్‌ లేకుంటే నో ఎంట్రీ.. కాలేజీలో వింత రూల్‌..!

NQ Staff - January 25, 2023 / 10:26 AM IST

College Management : అమ్మాయిలకు బాయ్‌ ఫ్రెండ్‌ లేకుంటే నో ఎంట్రీ.. కాలేజీలో వింత రూల్‌..!

College Management : మనకు తెలిసినంత వరకు కాలేజీలో చదువుకోవాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. క్రమశిక్షణతో నడుచుకోవాలని ఏ కాలేజ్ అయినా చెబుతుంది. అంతే గానీ ప్రేమ, దోమ అంటే మాత్రం అస్సలు ఊరుకోవు కాలేజీ యాజమాన్యాలు. కాతా తాజాగా ఓ కాలేజీ చేసిన పని అందరికీ షాక్‌ ఇచ్చింది. త్వరలోనే ఫ్రిబ్రవరి 14 ప్రేమికుల రోజు రాబోతోంది. దాని కంటే ముందే మరికొన్ని స్పెషల్‌ డేస్‌ ఉన్నాయి.

అవేనండి రోజ్‌ డే, చాక్లెట్‌ డే, హగ్గింగ్‌ డే, కిస్సింగ్ డే లాంటివి. వీటి తర్వాత ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును గ్రాండ్‌ గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ప్రేమికులు రెడీ అవుతున్నారు. ఈ తరుణంలోనే ఓ కాలేజీ చేసిన సర్క్యులర్‌ అందరికీ షాక్‌ ఇచ్చింది. ఒరిస్సాలోని జగత్‌సింగ్‌పూర్‌లో ఎస్‌వీఎమ్‌ కాలేజ్‌ ఉంది.

అమ్మాయిల సంరక్షణ కోసమే..

 College Management Recently Set Up New Rule Come As Shock

College Management Recently Set Up New Rule  As Shock

 

ఈ కాలేజీలో అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకుంటున్నారు.  ఫిబ్రవరి 14 దగ్గరపడటంతో కాలేజ్‌ ప్రిన్సిపల్‌ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ సర్క్యులర్‌ లో కాలేజీలోని ప్రతి అమ్మాయికి ఓ బాయ్‌ ఫ్రెండ్‌ కచ్చితంగా ఉండాలి అంటూ రాసి ఉంది. అమ్మాయిల సంరక్షణ కోసమే బాయ్ ఫ్రెండ్ ఉండాలి అని అందులో ఉంది.

రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోను చూపిస్తేనే కాలేజీలోకి అనుమతి ఉంటుంది. లేకుండా కాలేజీలోకి నో ఎంట్రీ అంటూ అందులో ఉంది. ఇది విన్న వారంతా ఈ రూల్‌ తమ కాలేజీలో కూడా ఉంటే బాగుండు అని అంటున్నారు. మరి కొందరు మాత్రం స్టూడెంట్లను కాలేజీ యాజమాన్యాలే చెడగొడితే ఎలా అంటూ మండి పడుతున్నారు. మరి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us