Adipurush Movie : అనాథ పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూపించిన కలెక్టర్..!
NQ Staff - June 21, 2023 / 09:50 AM IST

Adipurush Movie : ఇప్పుడు ఆదిపురుష్ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన విషయం తెలిసిందే. ఇక మొన్న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి ఈ సినిమాకు.
అదే సమయంలో ట్రోల్స్, విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. ఈ రేంజ్ లో వివాదాలు చుట్టుముడుతున్న సమయంలో ఓ కలెక్టర్ చేసిన పని అందరినీ ఆకట్టుకుంది. తాజాగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ నరసరావు పేటలోని అనాథ పిల్లలు, సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్లకు ఆదిపురుష్ సినిమాను చూపించారు.
దాదాపు 500 మంది పిల్లలకు ఆయన సినిమా చూపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా కూడా కలెక్టర్ ను అభినందిస్తున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలు సినిమాను త్రీడీలో చూశారని తెలిపారు. సినిమా చూస్తున్నంత సేపు వారి కళ్లల్లో ఆనందం కనిపించిందన్నారు.

Collector Siva Shankar Narasa Rao Peta Showed Adipurush Movie To Orphans
ఇక కలెక్టర్ చేసిన పనిని అంతా అభినందిస్తున్నారు. మీరు చేసింది చాలా మంచి పని అంటూ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియజేయండి.