Colombia : కొలంబియాలో కుప్ప‌కూలిన స్టేడియం.. న‌లుగురు మృతి

NQ Staff - June 27, 2022 / 04:29 PM IST

Colombia : కొలంబియాలో కుప్ప‌కూలిన స్టేడియం.. న‌లుగురు మృతి

Colombia : కొలంబియాలో జరిగిన శాన్‌పెడ్రో ఉత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుల్రింగ్‌లోని గ్రాండ్‌స్టాండ్ చిన్న ఎద్దులతో తలపడే కార్యక్రమం ఆస‌క్తిక‌రంగా సాగుతుండ‌గా, ఒక్క‌సారిగా చెక్క స్టాండ్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు కొలంబియా దేశ అధికారులు తెలిపారు.

ఘ‌ట‌నలో గాయ‌ప‌డిన వారిని…

ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు,ఒక బాలుడు మరణించారని టోలిమా డిపార్ట్‌మెంట్ గవర్నర్ జోస్ రికార్డో చెప్పారు ఆస‌క్తిగా తిల‌కిస్తున్న స‌మయంలో .ప్రేక్షకులతో నిండిన మూడు-అంతస్తుల చెక్క స్టాండ్ కూలిపోయింది.దీంతో పలువురు ప్రేక్షకులు నేలపైకి పడ్డారు. ఘటనా స్థలంలో ఎవరో తీసిన మరో వీడియోలో ఒక ఎద్దు అరేనాలో తిరుగుతున్నప్పుడు స్టాండ్ నుంచి తప్పించుకుంది.

Collapsed Stadium in Colombia

Collapsed Stadium in Colombia

అయితే ఘ‌ట‌నలో గాయ‌ప‌డిన వారిని ఏరియా ఆసుపత్రులకు తరలించామని స్థానిక సివిల్ డిఫెన్స్ అధికారి లూయిస్ ఫెర్నాండో వెలెజ్ చెప్పారు.చెక్క స్టాండు కూలినపుడు శిథిలాల్లో ఎంతమంది ఉన్నారో తెలియదని, సహాయ పనులు చేపట్టామని అధికారులు చెప్పారు.

ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తామని కొలంబియా అవుట్‌గోయింగ్ ప్రెసిడెంట్ ఇవాన్ డ్యూక్ ట్విట్టర్‌లో తెలిపారు. మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు డ్యూక్ సంఘీభావం తెలిపారు.

 

 

 

Read Today's Latest వీడియోస్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us