Coffee Day : స్త్రీ శ‌క్తికి ఉదాహ‌ర‌ణ‌.. రూ.7 వేల కోట్ల అప్పు చేసిన భ‌ర్త‌.. తానేంటో నిరూపించిన మాళ‌విక‌

Coffee Day : కేఫ్ కాఫీడే అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడిన విష‌యం తెలిసిందే. నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక జాలరి ఒకరు ఇచ్చిన సమాచారంతో గాలించగా సిద్ధార్థ మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది. వ్యాపార లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయానని, ఇన్వెస్టర్లు, ఆదాయపు పన్ను అధికారులు ఒత్తిడి భరించలేకపోతున్నాని ఓ లేఖ రాసిపెట్టి సిద్ధార్థ తన ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత న‌దిలో దూకి చ‌నిపోయారు.

Coffee Day debts 7000 crore clear by Malavika
Coffee Day debts 7000 crore clear by Malavika

సిద్ధార్ధ భార్య మాళ‌విక హెగ్డే భ‌ర్త మ‌ర‌ణించిన త‌ర్వాత చాలా బాధ‌ప‌డింది. ఒక‌వైపు భ‌ర్త మ‌ర‌ణం, మ‌రోవైపు ఆయ‌న మిగిలిచ్చిన అప్పు. వీట‌న్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది. అప్పులు ఎగ్గొడితే.. భర్తకు, కుటుంబానికి చెడ్డ పేరు వ‌స్తుంది. కంపెనీని మూసేస్తే వేల మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయి. మరి ఏం చేయాలి?

మాళవిక కఠిన నిర్ణయం తీసుకుంది. కంపెనీని తిరిగి నిలబెడతామని, అప్పులు అణాపైసలుతో సహా తీర్చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బాధను దిగమింగి కంపెనీని ముందుండి నడిపించే బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. అందరి అంచనాలను పటాపంచాలు చేస్తూ.. కంపెనీ అప్పులు సగానికి (రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు.

ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. సిద్దార్థ్ విధికి తల వంచారు. మాళవిక విధికి ఎదిరించి నిలబడ్డారు. భవిష్యత్ వ్యాపార ప్రణాళికల మీద మాళవిక ద ఎకనమిక్ టైమ్స్‌కు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని చదివితే ఆమె ఎంత స్పష్టతతో ఉన్నారో.. ఎంత నమ్మకంగా ఉన్నారో.. ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం అవుతుంది.

కష్ట కాలంలో ఉద్యోగులు అండగా ఉన్నారని, బ్యాంకులు ఓపికతో వేచి చూశాయని తెలిపారు. మోదీ ఆత్మనిర్భర్ భారత్‌కు తమల్ని ఉదాహరించుకున్నారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని, భర్త కలల సాకారానికి పాటుపడతాని ఇంటర్వ్యూ ముగించారు.