పోలీస్ అధికారి ప్రాణం తీసిన కోడి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు?
Ajay G - October 29, 2020 / 01:51 PM IST

ఓ కోడి పోలీస్ ఆఫీసర్ ను చంపేసింది. నమ్మరా? అస్సలు నమ్మరా? ఈ స్టోరీ చదివాక మీరే నమ్ముతారు. నమ్మితీరుతారు. ఎహె.. సినిమా స్టోరీలు చెప్పకండి.. అని అనకండి.. ముందు స్టోరీ చదవండి..
మన దేశంలో కాదు లెండి… ఫిలిప్పీన్స్ అనే దేశంలో మన ఏపీలో జరిగినట్టే అక్కడ కూడా కోడి పందెలు జరుగుతాయి. మన దగ్గర ఎలా కోడిపందెలు బ్యానో అక్కడ కూడా బ్యాన్ చేశారు. కానీ.. ఊరుకుంటారా? మన దగ్గర కేవలం సంక్రాంతికి మాత్రమే కోడిపందెలు నిర్వహిస్తారు.

cock kills police officer news goes viral
కానీ.. ఫిలిప్పైన్స్ లో ఎప్పుడు చూసినా కోడిపందెలే నిర్వహిస్తారు. పోలీసులు ఎన్నిసార్లు పట్టుకున్నా.. అక్కడి కోడిపందెల నిర్వాహకులు మాత్రం మారరట. వాళ్లు వెళ్లిపోగానే.. మళ్లీ అదే ఆట. అదే జోరు.
ఓ ప్రాంతంలో కోడి పందెలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. అంతే.. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కోడి పందెల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇంతలో అక్కడ కోడి పందెల్లో పాల్గొన్న ఓ కోడి పోలీస్ ఆఫీసర్ అయిన అర్నెల్ పైకి దూసుకొచ్చింది. ఎహె.. కోడే కదా ఏం చేస్తుందిలే అని అతడు అనుకున్నాడు. కానీ.. వేగంగా అతడి మీదికి దూసుకొచ్చిన కోడిపుంజు.. అతడిపై దాడి చేసింది. తన కాళ్లకు కట్టి ఉన్న విషం పూసిన కత్తితో ఆయన తొడ మీద దాడి చేసింది. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు. ఒక కోడి.. పోలీస్ ఆఫీసర్ ను చంపేయడంతో.. ఆ కోడిని అరెస్ట్ చేయలేక.. ఆ కోడితో పందెలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అరెస్ట్ చేసి.. నిందితుల జాబితాలో వాళ్ల పేర్లు చేశారు. వామ్మో.. ఆ కోడికి ఎంత పౌరుషం. కోడి పందెల కోసం దాన్ని అలా తయారు చేశారు మరి.