CM YS Jagan Mohan Reddy : కన్నీళ్ళు ఒలకాలట.! సీఎం జగన్ కరగాలట.! పింఛనుదారులకు ‘నట’ శిక్షణ.!
NQ Staff - January 3, 2023 / 10:59 AM IST

CM YS Jagan Mohan Reddy : పింఛనుదారులకు నటనలో శిక్షణ ఇప్పిస్తున్నారట అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటన కోసం అధికారులు పడుతున్న అవస్తలు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు.. ఇంకోపక్క అధికారులు.. ఈ విషయంలో కలిసి పనిచేస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్ షో జరుగుతుందట. వివిధ జిల్లాల నుంచి సుమారు 1640 మంది పోలీసుల్ని ఇందుకోసం వినియోగిస్తున్నారు.
లబ్దిదారులకు నటనలో శిక్షణ.?
పించను లబ్దిదారులు గుండెలు పిండేసేలా ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో చెప్పడానికి అధికారులు నానా తంటాలూ పడుతున్నారు. అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు అధికారులకు ఈ విషయంలో సాయం చేస్తున్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, చేనేత అలాగే కల్లుగీత కార్మికులు.. ఇలా వివిధ వర్గాలకు చెందినవారి నుంచి బాగా మాట్లాడగలిగే లబ్దిదారుల నుంచి ఎంపిక చేసి, సోమవారమే వారికి తగిన తర్ఫీదు ఇచ్చారు. సీఎం సభా వేదిక పక్కనే, లబ్దిదారుల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు.
సభ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి వారితో మాట్లాడతారట. ఈ సందర్భంగా లబ్దిదారుల మాటలు ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అయ్యేలా వుండాలట. మరోపక్క, ముఖ్యమంత్రి మాట్లాడే స్క్రిప్టు కూడా షరామామూలుగానే ప్రత్యేకంగా రెడీ అయినట్లు తెలుస్తోంది.