Jabardasth Panch Prasad : థాంక్యూ సీఎం గారు.. పంచ్ ప్రసాద్ ఎమోషనల్ వీడియో
NQ Staff - June 12, 2023 / 08:07 PM IST

Jabardasth Panch Prasad : జబర్దస్త్ తో పాటు ఈటీవీలో మల్లెమాల వారు నిర్వహించే పలు కార్యక్రమాల్లో కనిపించి ఫేమస్ అయిన కమెడియన్ పంచ్ ప్రసాద్. ఈయన గత కొన్నాళ్లుగా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. పెద్ద మొత్తంలో డబ్బు లు ఖర్చు అవుతున్నా కూడా బతికే పరిస్థితి లేదు అంటూ వైద్యులు అన్నారు.
చేతిలో డబ్బు లేక పలు సార్లు సహాయం కోసం ఎంతో మంది వద్ద రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈసారి పంచ్ ప్రసాద్ కు మంత్రి రోజా మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం చేశారు. ఈ విషయాన్ని పంచ్ ప్రసాద్ తెలియజేశారు. ఒక వీడియోను విడుదల చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరియు మంత్రి రోజా కు కృతజ్ఞతలు తెలియజేశారు.
తన యొక్క కిడ్నీ సమస్య గురించి తెలుసుకున్న మంత్రి రోజా గారు మరియు ముఖ్యమంత్రి జగన్ గారు సహాయం చేశారు. నా విషయం రోజా గారు సీఎం గారి వద్దకు తీసుకు వెళ్లిన వెంటనే సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ ను రిలీజ్ చేశారు అంటూ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు.
సీఎం జగన్ గారు సహాయం మరచిపోలేను – జబర్దస్త్ పంచ్ ప్రసాద్❤️???? pic.twitter.com/A1jO1LW7dx
— ???????????????????????? ???????????? ???????????????????? (@YSJ2024) June 12, 2023