చట్టం ప్రకారం నడిస్తేనే అభివృద్ధి : సీఎం జగన్

Advertisement

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏపీ రాష్ట్రం విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. తరువాత పోలీసుల నుండి గౌరవ వందనం అందుకున్నాడు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. అభివృద్ధి కావాలంటే రాజ్యాంగ మరియు చట్టాలను అనుసరించాలని అన్నాడు.

అలాగే ప్రతిఒక్కరు కూడా దేశ భక్తి కలిగి ఉండాలని కొనియాడారు. సమానత్వం అనే పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకుండా అందరు సమానత్వంగా ఉండాలని అన్నారు. అలాగే ఎస్సీ, బీసీ, మైనారిటీలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 30 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని అన్నాడు. అలాగే రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు ఆర్థిక సహాయం చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here