హిందూస్థాన్ షిప్ యార్డ్ ఘటన పై ఆరా తీస్తున్న జగన్

Advertisement

హిందూస్థాన్ షిప్ యార్డ్ లో జరిగిన ప్రమాదంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. భారీ క్రేన్ విరిగిపడటంతో 11 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియకపోవడంతో అక్కడ పని చేస్తున్న వారి బంధువులు చూడటానికి అనుమతి ఇవి ఇవ్వాలని భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఈ ఘటనపై టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని లోకేష్ పేర్కొన్నారు.ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, గాయపడ్డవారు త్వరగా కొలుకునేలా దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాని గంటా శ్రీనివాస రావ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here