CM Revanth Reddy : కుమారీ ఆంటీకి సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. బిజినెస్ కు లైన్ క్లియర్..!

NQ Staff - January 31, 2024 / 01:10 PM IST

CM Revanth Reddy : కుమారీ ఆంటీకి సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. బిజినెస్ కు లైన్ క్లియర్..!

CM Revanth Reddy :

నిన్నటి నుంచి కుమారీ ఆంటీ బిజినెస్ క్లోజ్ అయిందంటూ సోషల్ మీడియా మొత్తం హోరెత్తి పోయింది. కొందరు అయితే కుమారీ ఆంటీ మీద జాలి చూపిస్తూ తెలంగాన కాంగ్రెస్ ప్రభుత్వం మీద సీరియస్ అయ్యారు. ఎంతో మంది యువ వ్యాపారులకు ఆమె ఆదర్శం అని.. అలాంటి ఆమె బిజినెస్ క్లోజ్ చేయించడం ఏంటంటూ దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నాలు చేశారు.

కానీ కుమారీ ఆంటీ బిజినెస్ క్లోజ్ చేయించడం వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసులే స్వయంగా తెలిపారు. ఆమె బండి వద్ద తినడానికి వస్తున్న వారి సంఖ్య వందల్లో ఉండటంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటం వల్లనే క్లోజ్ చేయించినట్టు తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. అయితే తాజాగా ఆమెకు గుడ్ న్యూస్ తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

కుమారీ ఆంటీ బిజినెస్ కు లైన్ క్లియర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కుమారీ ఆంటీ బిజినెస్ ను ఇంతకుముందు ఉన్న ప్లేస్ లోనే యథావిధంగా నడిపించుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని, పోలీసులను ఆదేశించారు. కుమారీ ఆంటీ ఎంతో మంది యువ వ్యాపారవేత్తలకు ఆదర్శంగా ఉంటుందని.. అలాంటి వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది తప్ప.. ఇబ్బంది పెట్టదని రేవంత్ స్పష్టం చేశారు.

CM Revanth Reddy Issued Orders Kumari Aunty Can Do Business

CM Revanth Reddy Issued Orders Kumari Aunty Can Do Business

తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షాన, సొంతంగా వ్యాపారం చేసుకునే వారి పక్షాన ఉంటుందని తెలిపారు. కుదిరితే త్వరలోనే రేవంత్ వెళ్లి ఆమె స్టాల్ ను విజిట్ చేస్తారని కూడా అధికారులు తెలిపారు. దాంతో కుమారీ ఆంటీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమెకు న్యాయం జరిగిందని.. రేవంత్ ను ప్రశంసిస్తున్నారు.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us